ఫ్యాక్ట్ చెక్: విద్యార్ధులకి ప్రభుత్వం ల్యాప్ టాప్ లని ఇస్తోందా..?

-

ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అందుకని తెలియని వాటికీ, అనుమానంగా అనిపించే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

తాజాగా సోషల్ మీడియా లో ఒక వార్త వచ్చింది. పైగా ఈ వార్త తెగ ప్రచారం అవుతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విద్యార్థులకి ఫ్రీగా ల్యాప్టాప్లను ఇస్తుందని ఆ వార్తలో ఉంది. అయితే మరి నిజంగా ప్రభుత్వం విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేస్తోందా..? ఇందులో నిజమెంత అనేది చూస్తే… కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి ల్యాప్టాప్లను అందించడం లేదని ఇది కేవలం నకిలీ వార్త అని స్పష్టం గా తెలుస్తోంది.

సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్న ఈ వార్త లో ఏ మాత్రం నిజం లేదు. ఇటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకో లేదు ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే. సోషల్ మీడియాలో టెక్స్ట్ మెసేజ్ తో ప్రభుత్వం ఫ్రీగా విద్యార్థులకి ల్యాప్టాప్లు ఇస్తోందని వస్తోంది.

పైగా ఒక లింక్ కూడా ఇస్తున్నారు అయితే ఇలాంటి వాటిని అనవసరంగా నమ్మొద్దు. ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ ని తీసుకు రాలేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇది నకిలీ వార్త అని చెప్పేసింది. కనుక అనవసరంగా నమ్మి మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news