ఫ్యాక్ట్ చెక్: కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై వడ్డీ ఉండదా..? నిజం ఎంత..?

-

నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ వార్త వస్తూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అన్న సరే సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే మరి నిజంగా అది నకిలీ వార్తా లేదంటే అందులో నిజం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కిసాన్ క్రెడిట్ కార్డుల పై ఎలాంటి వడ్డీ వసూలు చేయబడదు అని సోషల్ మీడియాలో వార్త వచ్చింది. అయితే నిజంగా అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.

కొత్త ఆర్థిక సంవత్సరం 2022-23 మొదటి రోజు నుండి అంటే ఏప్రిల్ 1 నుండి కిసాన్ క్రెడిట్ కార్డ్ పై వడ్డీ ఉండదని ప్రచారం సాగుతోంది. అయితే ఇది నిజమా కాదా అనేది చూస్తే… ఇటువంటి ఏమీ నమ్మవద్దని ప్రభుత్వం చెప్పింది. పైగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద వడ్డీలేని రుణం ఇస్తున్నారని.. వార్తల్లో నిజం లేదని చెప్పేసింది. కనుక ఇలాంటి వార్తలను అస్సలు నమ్మొద్దు. అనవసరంగా షేర్ కూడా చేయకండి.

ఇప్పటి వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీం కింద 2.92 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. 3 లక్షల వరకూ వ్యవసాయ రుణాలపై వడ్డీ రేటు 7 శాతం వరకూ వసూలు చేస్తున్నారు. అయితే ఎప్పుడైనా సరే సోషల్ మీడియాలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి వార్తలు వస్తే దానిలో నిజం ఎంత అనేది తెలుసుకోండి. అనవసరంగా మాత్రం నమ్మకండి.

Read more RELATED
Recommended to you

Latest news