ఫ్యాక్ట్ చెక్: ఈ వెబ్ సైట్ ప్రభుత్వానిది కాదా..? మరి అసలు నిజం ఏమిటి..?

-

ఈ మధ్య కాలంలో వస్తున్న వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజు రోజుకి ఏదో ఒక ఫేక్ వార్త మనం వింటూనే ఉన్నాం. ఉద్యోగాలు అంటూ డబ్బులు కట్టించుకోవడం.. స్కీములు అంటూ స్కాములు చేయడం ఇలా చాలా చూశాము. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ఇవి బాగా ఎక్కువైపోయాయి. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ఎక్కువ మంది ఆన్లైన్ పేమెంట్స్ చేయడం వలన మోసాలు కూడా పెరిగిపోయాయి.

ఏదేమైనా ఇలాంటి నకిలీ వార్తలకి దూరంగా ఉండాలి. లేదంటే అనవసరంగా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే తాజాగా మరోక వార్త వచ్చింది. ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. సర్వ శిక్ష ఆన్లైన్ అనే ఒక వెబ్సైట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇది గవర్నమెంట్ వెబ్ సైట్ అన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.

కానీ నిజానికి దీనికి ప్రభుత్వ వెబ్ సైట్ కి సంబంధం లేదని పీఐబి ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి ఈ వెబ్సైట్ కి ఎటువంటి సంబంధం లేదు. సర్వ శిక్ష వెబ్ సైట్ ఆన్లైన్ ఉద్యోగాలు ఇస్తామంటూ వస్తున్న దాంట్లో నిజం లేదు కాబట్టి ఎవరూ నమ్మకండి. అనవసరంగా దీనిని నమ్మరంటే మీరే మోసపోవాల్సి వుంది. కాబట్టి ఇటువంటి ఫేక్ వార్తలతో జాగ్రత్తగా ఉండండి. అలానే నకిలీ వెబ్ సైట్ల జోలికి వెళ్లొద్దు. దీనివల్ల మీరే అనవసరంగా నష్టపోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news