భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డి కుటుంబం..15 మందిపై కేసు !

-

మంత్రి మల్లారెడ్డి అలాగే.. ఆయన కుటుంబ సభ్యులు భూ వివాదంలో చాలా సార్లు చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మరోసారి మంత్రి మల్లారెడ్డికి చిక్కులు వచ్చాయి. మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త అయిన ముద్దుల శ్రీనివాసరెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నాడు.

mallareddy

గుండ్ల పోచంపల్లి మున్సిపల్ లోని భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ముద్దుల శ్రీనివాస్ రెడ్డి తో పాటు15 మందిపై కేసు నమోదు కాగా వారిలో 10మందిని రిమాండుకు తరలించిన్నట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు.

గుండ్లపోచంపల్లిలోని సర్వే నంబర్ 5,6లో ఉన్న భూ యజమానులు మల్లారెడ్డి, వేణునాయుడు మధ్య స్థలవివాదం నడుస్తోంది. గత మూడు రోజుల కిందట రాత్రి 1 గంట సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించి స్థలంలో ఉన్న కడీలను పడగోట్టి సెక్యురిటీ సిబ్బందిని విచక్షణారహితంగా దాడి చేశారని ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులపై కేసు నమోదు చేయగా అందులో 10 మందిని ఇప్పటికే రిమాండ్ తరలించామని, మరో 5గురు మంత్రి బామ్మర్ది శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, నర్సింహారెడ్డి లు పరారీలో ఉన్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version