టీడీపీ కంచుకోటలో ఫ్యాన్ లీడ్..ట్విస్ట్ ఏంటంటే?

-

గత ఎన్నికల్లో జగన్ గాలిని ఎదురుకుని మరీ టీడీపీ 23 చోట్ల గెలిచిన విషయం తెలిసిందే..ఆ స్థానాల్లో టీడీపీ చాలా బలంగా ఉండటం…అలాగే అక్కడ నాయకులు స్ట్రాంగ్ గా ఉండటంతో విజయం సాధ్యమైంది…అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ..టీడీపీ సిటింగ్ సీట్లపై ఫోకస్ చేసి మరీ రాజకీయం చేస్తూ వచ్చింది…ఎలాగైనా టీడీపీ సీట్లని కైవసం చేసుకోవాలనే దిశగా పనిచేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు ధీటుగా బలమైన వైసీపీ నేతలని బరిలోకి దింపారు.ఇదే క్రమంలో టీడీపీ కంచుకోటగా ఉన్న మండపేట ఇంచార్జ్ గా తోట త్రిమూర్తులుని వైసీపీ ఇంచార్జ్ గా పెట్టారు. మామూలుగా మండపేట టీడీపీ కంచుకోట…పైగా 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వేగుళ్ళ జోగేశ్వరరావు విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో పిల్లి సుభాష్ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు..ఇక ఆయనకు రాజ్యసభ ఇచ్చి…మండపేట ఇంచార్జ్ గా టీడీపీ నుంచి వచ్చిన తోటని నియమించారు.

ఇక ఇంచార్జ్ పదవి వచ్చాక…మండపేటలో వైసీపీని బలోపేతం చేసే దిశగా తోట పనిచేశారు…స్థానిక ఎన్నికల్లో వైసీపీకి మంచి విజయాలు అందించారు. ఇలా విజయాలు అందించడంలో కీలకపాత్ర పోషించడంతో జగన్…తోటకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ పదవి వచ్చాక మరింత దూకుడుగా తోట పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మండపేట సీటు సైతం తోటకు దక్కేలా ఉంది..ఎలాగో తన సొంత నియోయజకవర్గం రామచంద్రాపురం నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు…కాబట్టి మండపేటలోనే తోట బరిలో దిగేలా ఉన్నారు.

అయితే మండపేటలో వైసీపీకి విజయావకాశాలు మెండుగానే ఉన్నాయి…కాకపోతే టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళకు మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి…వైసీపీ విజయం ఈజీ కాదు.. అలాగే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది..నెక్స్ట్ గాని టీడీపీకి జనసేన సపోర్ట్ ఇస్తే…మండపేటలో వైసీపీ విజయం చాలా కష్టం..ఆ రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి మళ్ళీ చెక్ పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news