సినీ పరిశ్రమలో వందల సినిమాలు చేసిన నటీనటులు వయసు పైబడ్డాక సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. పోనీ సినిమాలు చేయలేదు సరే..కనీసం ఆరోగ్యంగా.. సంతోషంగా ఉన్నారా అంటే అదీ లేదు.. ఇటీవల కాలంలో చాలా మంది సీనియర్ నటీనటులు ఒక్కొక్కరిగా అనారోగ్య బారిన పడుతూ అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా ఒక సీనియర్ స్టార్ హీరోని చూసి అభిమానులు తరుక్కుపోతున్నారు ఒక్కసారిగా ఆయనను వీల్ చైర్ లో చూసేసరికి దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు అభిమానులు..
ఆయన ఎవరో కాదు కెప్టెన్ విజయ్ కాంత్.. ఎక్కువగా పోలీస్ స్టోరీస్ తో సినిమాలు చేసిన విజయకాంత్ గురించి సౌత్ ఇండియన్ ఆడియన్స్ కి పరిచయం అవసరం లేదు. కెరియర్ మొత్తం మీద తమిళ భాషలోనే ఎక్కువగా సినిమాలు చేసిన ఈయన 1979లో నటుడిగా కెరియర్ ప్రారంభించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు నటుడిగా ఒక వెలుగు వెలిగారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు డిఎండీకే పార్టీ స్థాపించి రాజకీయాలలోకి కూడా ప్రవేశించారు. 2006, 2011 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు.
January 31st
Wishing Our Captain @iVijaykanth Sir And #Premalatha Madam,
A Very Happy 33 Wedding Anniversary.#Vijayakanth #CaptainVijayakanth #PremalathaVijayakanth #Premalatha #DMDK#WeddingAnniversary@lksudhish @MpAnand_PRO@idiamondbabu @esakkimuthuk @RIAZtheboss pic.twitter.com/e0Kuj65ni0— Actor Kayal Devaraj (@kayaldevaraj) January 30, 2023
తన వందవ సినిమా కెప్టెన్ ప్రభాకరన్ మూవీ తో కెప్టెన్ బిరుదు పొంది ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. ఈయన సినిమాలు తెలుగుతోపాటు హిందీలో కూడా డబ్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వయసు 70 సంవత్సరాలు. కొన్ని రోజుల నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతున్నారట. ఆ కారణంగానే గత ఎడాది వైద్యులు ఆయన కాలికి మూడు వేళ్ళ ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చూసి అభిమానులు అల్లాడిపోతున్నారు.
#SAChandrasekhar #Vijayakanth Recent Clicks 📸😍❤️ pic.twitter.com/dIuonEJPcB
— Trend Soon (@trend_soon) January 31, 2023