Telangana: కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు

-

Farmers besieged sub-station protesting power cuts:  కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్ స్టేషన్ ముట్టడించారు రైతులు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కరెంట్ కోతలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామ రైతుకు స్థానిక సబ్ స్టేషన్ ముట్టడించారు. కొంత కాలంగా విద్యుత్తు సమస్యలు వేధిస్తున్నాయని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Farmers besieged sub-station protesting power cuts

ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ కోతలు విధిస్తున్నారని.. గతంలో ఎన్నడూ లేనివిధంగా కోతలు విధించడమేమిటని ప్రశ్నించారు. లో వోల్టేజ్ సమస్యతో ఇళ్లల్లో ఫ్రిజ్లు, టీవీలు, కూలర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక అటు హైదరాబాద్లో కరెంట్ కోతలతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 గంటల కంటే ఎక్కువ సేపు కోత పెట్టడంతో అవస్థలు పడుతున్నారు. వేసవి సన్నద్ధతలో భాగంగా హైదరాబాద్లో చేపట్టిన విద్యుత్తు మరమ్మతులపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. ఉపకేంద్రాల నిర్వహణ దగ్గర్నుంచి లైన్ల మరమ్మతుల వరకు ఏదైనా రెండు గంటలు మించకూడదని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ఆదేశించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version