రాత్రి చేసిన రొట్టెను తినడానికి సంకోచిస్తున్నారా..? తింటే ఈ వ్యాధులన్నీ..

-

రాత్రి చపాతీలు తినే ఫ్యామిలిలో.. మనకు అన్నం మిగిలినట్లే.. వారికి చపాతీలు మిగిలిపోతాయి. సద్దెన్నం అయితే తింటారు. కానీ సద్ది చపాతీలు, రొట్టెలు తినాలా వద్దా అని చాలామంది సందేహ పడతారు. ఇక పారేయటం ఎందుకు అని తప్పక తింటుంటారు. కానీ మీకు తెలుసా.. రాత్రి మిగిలిపోయిన చపాతీలు ఉదయం తింటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయజనాలు ఉన్నాయని. ఎలా అయితే సద్ది అన్నం బాడీకీ చలవ చేస్తుందో.. చపాతీలు కూడా బాడీకి మేలు చేస్తాయట. ఈ విషయాలు తెలిస్తే.. ఇక మీరు కావాలనే.. చపాతీలు నైట్ ఎక్కువ చేసుకుని ఉదయం తింటారేమో కదా..! ఇంకెందుకు లేట్.. ఇది ఏ ఏ ఆరోగ్యసమస్యలకు మంచి పరిష్కారమే చూద్దామా..

అధిక రక్తపోటు ఉన్నవారికి పాత రొట్టె అంటే రాత్రి చేసిన రొట్టె చాలా మంచిది. రోజూ ఉదయాన్నే పాలతో పాటు కిందటి రోజు చేసిన రొట్టె తినడం రక్తపోటు అదుపులో ఉంటుంది. చిన్నప్పుడు చాలా మంది.. నైట్ మిగిలిపోయిన చపాతీలను ఉదయం పాలల్లో వేసుకుని తినే ఉంటారు. ఇప్పుడు అదే హెల్త్ టిప్ అయింది.

నైట్ చేసిన చపాతీల్లో ఫైబర్ ఉంటుంది.. కాబట్టి ఉదయాన్నే పరగడుపున ఈ చపాతీలు తింటే పొట్ట చాలా సేపు నిండుగా ఉంటుంది. పదే పదే ఆకలి వేయదు. ఇది బరువును అదుపులో ఉంచుతుంది.

ఉబ్బసం ఉన్నవారికి, ఈ పాత చపాతీలు మ్యాజిక్ చేస్తాయి. ఎలా అంటే.. ఇది ఆస్తమా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం, విటమిన్లు అధికంగా ఉండంతో ఆయాసాన్ని తగ్గిస్తాయట.

రాత్రి మిగిలిన చపాతి తినటం వల్ల.. స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడుతుంది. పాత రొట్టె గుండెల్లో మంట, అజీర్ణం మరియు కడుపు సమస్యలను కూడా తగ్గిస్తుంది.

మీకు తెలుసో లేదో.. కొన్ని ఏరియాల్లో.. కావాలనే.. చపాతీలు రాత్రి ఎక్కువగా చేసుకుని ఉదయం వాటినే టిఫెన్ తీసుకుంటారు. అందుకే వాళ్లు అంత ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి.. నైట్ మిగిలిపోయిన చపాతీలు అని చీప్ గా చూడకుండా..హెల్తీగా తినేయండి. అయితే కొందరికి చపాతీలు చేయడం సరిగ్గా రాక.. అవి చేసినగంటకే గట్టిగా అవుతాయి. ఇక తెల్లారి అంటే.. లాక్కోలేక పీక్కోలేక చావాలి.. చపాతీలు సాఫ్ట్ గా రావాలంటే.. వాటిని బాగా కలపాలి. పిండి చేసేప్పుడు అందులో కాస్త ఆయిల్ వేసి మెత్తగా కలిపితే.. చపాతీలు సాఫ్ట్ గా వస్తాయి. అప్పుడు తెల్లారినా బానే ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news