కమలంలో కుస్తీ…’బండి’ పైనే గురి?

-

సాధారణంగా ఏ రాజకీయ పార్టీలోనైనా నేతల మధ్య ఆధిపత్య పోరు ఉండటం సహజం…రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు నేతలు పోటీ పడుతుంటారు…అలాగే కీలక పదవులు పొందేందుకు ట్రై చేస్తుంటారు. ఇదే క్రమంలో ఒకరినొకరు కిందికి లాగే ప్రయత్నాలు కూడా చేసుకుంటారు. అయితే ఈ ఆధిపత్య పోరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ కనిపిస్తుందని చెప్పొచ్చు…కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరినొకరు చెక్ పెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు.

అంటే కాంగ్రెస్ పార్టీలో అంతా ఓపెన్ గా ఉంటుంది కాబట్టి..ఆధిపత్య పోరు ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ లో, అధికారం దక్కించుకోవడం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీలో కూడా ఈ పోరు ఎక్కువగానే ఉంది. మొన్నటివరకు ఈ రెండు పార్టీల్లో పోరు పెద్దగా బయటకు కనబడలేదు. ఈ మధ్య మాత్రం నేతల మధ్య వార్ నడుస్తున్నట్లే కనిపిస్తోంది.

ఇక బీజేపీలో కూడా అంతర్గత యుద్ధంగా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. అయితే కేంద్ర పెద్దల చేతుల్లో ఉంటుంది కాబట్టి…పార్టీలో వార్ పెద్దగా బయటపడకపోవచ్చు..కానీ తెలంగాణ బీజేపీ నేతల మధ్య అంతర్గత పోరు ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో కొందరు బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే సీనియర్లు ఆయనపై గుర్రుగా ఉన్నారని సమాచారం.

అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్ సైతం…బండి వైఖరి పట్ల కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బండి-ఈటల రాజేందర్ కు పెద్దగా పొసగడం లేదని ఎప్పటినుంచో టాక్ నడుస్తోంది. ఇద్దరు నేతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారే కావడంతో..ఈ పోరు మరింత ఎక్కువైందని సమాచారం.

పైగా ఈటలకు బండి పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదనే చర్చ నడుస్తోంది…అందుకే ఈటల డైరక్ట్ గా కేంద్ర పెద్దలతోనే డీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశం బండి వర్గానికి నచ్చుతున్నట్లు కనిపించడం లేదు. అందుకే ఈటలకు చెక్ పెట్టడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర పెద్దలు అంతర్గత పోరు పెరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల..బీజేపీలో ఎలాంటి ఇబ్బందులు రావడం లేదని చేపోచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version