నేడు ఏపీలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటన

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లాకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రానున్నారు. అనంతపూర్ జిల్లా లోని గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ అకాడమీ పనులకు భూమిపూజ చేయనున్న నిర్మలా సీతారామన్.

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ చౌదరి అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో… ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఢిల్లీ నుంచి నిర్మల సీతారామన్ ఏపీకి బయలుదేరుతారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు.

అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. ఇక కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పర్యటన నేపథ్యంలో వస్తూ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. నా సిన్ సంస్థలో భూములు కోల్పోయిన రైతులకు అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. పాలసముద్రం లో కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version