జేఈఈ మెయిన్స్‌ విద్యార్థులకు శుభవార్త.. ప్రాథమిక కీ విడుదల

-

జేఈఈ మెయిన్స్‌ విద్యార్థులకు శుభవార్త. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీలలో ప్రవేశాలకోసం ఎన్టీఏ ఆధ్వర్యంలో గత నెల 23వ తేదీ నుంచి ప్రారంభమైన జేఈఈ మెయిన్స్‌ జిల్లాలో 29వ తేదీన ముగిశాయి. దేశవ్యాప్తంగా గత నెల 23 నుంచి 29 వరకు జరిగిన జేఈఈ మెయిన్స్ మొదటి విడత పేపర్-1, 2 పరీక్షల ప్రాథమిక కీని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) శనివారం రాత్రి వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. కీ పై అభ్యంతరాలుంటే ఈ నెల 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయవచ్చని తెలిపింది. అందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200లు చెల్లించాలని పేర్కొంది ఎన్టీఏ.

2021లో రద్దు చేసిన టై బ్రేకర్‌ విధానాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మళ్ళీ తెరమీదకు తెచ్చింది. ర్యాంకుల్లో సమానమైన స్కోర్‌ సాధించినప్పుడు వయసును కూడా ప్రామాణికంగా తీసుకోవడం ఈ విధానంలో ప్రత్యేకత. ఇద్దరు విద్యార్థులు పరీక్షలో సమానమైన మార్కులు సాధిస్తే ముందుగా గణితం, ఫిజిక్స్, కెమెస్ట్రీల మార్కులను పరిగణనలోనికి తీసుకుంటారు. ఆ తర్వాత తప్పు సమాధానాల నిష్పత్తిని సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో మార్కులు ఉంటే వయసును పరిగణనలోనికి తీసుకుంటారు. అప్పుడు కూడా ఇద్దరూ సమానంగా ఉంటే, ముందు ఎవరు దరఖాస్తు చేశారో చూసి ర్యాంకులు నిర్ధారిస్తారు. జేఈఈ మెయిన్స్‌ పరీక్ష మొదటి విడత జూన్‌ 23 నుంచి 29 వరకూ , ఆ తర్వాత జూలై 21 నుంచి 30 వరకూ రెండో విడత జరుగుతుంది. కోవిడ్‌ సమయంలో నాలుగు విడతల పరీక్ష విధానాన్ని రెండు విడతలుగా మార్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది ఈ పరీక్ష రాస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version