ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్.. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!

బర్మింగ్‌హోమ్ వేదికగా జులై 1న ఇంగ్లాండ్-భారత జట్టు మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే టీ20, వన్డే మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయర్ల ఎంపికను బీసీసీఐ ఇంకా ఎంపిక చేయలేదు. పరిమిత ఓవర్ల సిరీస్‌కు బీసీసీఐ భారత సీనియర్ ఆటగాళ్లందరినీ తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

 హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా

దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, షమీ దూరమయ్యారు. అయితే ఇరు జట్ల మధ్య తొలి టీ20 సౌతాంప్టన్ వేదికగా జులై 7న జరగనుంది. జులై 1న ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ జులై 5వ తేదీన ముగియనుంది. తొలి టీ20 మ్యాచ్‌కు సిద్ధం కావడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలింది. ఐర్లాండ్‌తో తలబడిన భారత జట్టునే ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో ఆడించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలా అయితే ఇంగ్లాండ్ తొలి టీ20 మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించే అవకాశం ఉంది.