వాహనదారులకు కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. రోడ్డు భద్రత విషయంలో కేంద్రం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ముఖ్యంగా కాలం చెల్లిన వాహనాలను రోడ్లపైకి రాకుండా… కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త రూల్స్ ఇవే
భారీ గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు, మీడియం సరకు రవాణా, ప్యాసింజర్ వాహనాలు, ఇతర తేలికపాటి వాహనాలు పిట్ నెస్ సర్టిఫికేట్, రిజస్ట్రేషన్ సర్టిఫికేట్ ను… వాహనం అద్దంపై ఎడమవైపపు పై భాగంలో అతికించి ఉంచాలి.
ఆటోలు, ఎలక్ట్రిక్ రిక్షాలు, ఈ – కార్టులు కూడా అద్దంపై ఎడమ వైపుపై భాగంలో నిర్ణీత సర్టిఫికేట్ ను డిస్ ప్లేచేయాలి. వీలు పడకుంటే.. కాస్త అటు, ఇటూగా పెట్టొచ్చు.
ఇక బైకులు అలాగే స్కూటర్ల వంటివాటిపై అయితే ఫిట్నెస్ సర్టిఫికెట్ ను స్పష్టంగా కనిపించే ప్రాంతంలో పెట్టాల్సి ఉంటుంది.
ఈ సమాచారాన్ని నీలిరంగు బ్యాక్ గ్రౌండ్ లో పసుపు పచ్చ రంగు అక్షరాలతో ఉండాలి. అక్షరాలు టైప్ బోల్డ్ స్క్రిప్ట్ లో ఉండాలి.
ఈ సర్టిఫికెట్ లో వాహన ఫిట్నెస్ తేదీ, నెల అలాగే సంవత్సరం ఫార్మాట్ లో పొందుపరచాలి.