Breaking : ఐదుగురు ఐఏఎస్‌లకు స్థానచలనం

-

ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు స్థానచలనం జరిగింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కాటమనేని భాస్కర్‌ని ప్రభుత్వం… నాలుగు నెలల వ్యవధిలోనే రెండు సార్లు బదిలీ చేసింది. భాస్కర్‌ తో మరో నలుగురు ఐఏఎస్‌ లకూ స్థానచలనాలు జరిగాయి. కాటమనేని భాస్కర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 4న రవాణాశాఖ కమిషర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రజాప్రతినిధుల సిఫార్సులకు తలొగ్గకపోవడంతో… జూన్‌ 28న రాత్రి బదిలీ వేటుకు గురయ్యారు. ఆయనకు అంతగా ప్రాధాన్యం లేని కృష్ణా, గోదావరి కాలువల పారిశుద్ధ్య మిషన్‌కు కమిషనర్‌గా నియమించారు. ఇప్పుడు మళ్లీ పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్‌ గా బదిలీ చేశారు.

Govt orders transfer of 4 IAS officers – The Dispatch

సాంకేతిక విద్య శాఖ డైరెక్టరుగా నాగరాణిని… జౌళి, చేనేత శాఖ కమిషనర్ గా M.M నాయక్‌, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మికి సాంఘీక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సర్వ శిక్షాభియాన్ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టరుగా శ్రీనివాసరావుకు బాధ్యతల అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news