జూనియర్ లైన్‌మెన్ పరీక్షల్లో అవకతవకలు.. ఐదుగురు అరెస్టు

-

రాష్ట్రంలో ఈ నెల 17న నిర్వహించిన జూనియర్‌ లైన్‌మెన్ల నియామక పరీక్షలో జరిగిన అక్రమాలపై పోలీసులు దృష్టి సారించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘట్​కేసర్​లోని కేంద్రంలో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఓ ఇద్దరు విద్యుత్ శాఖ అధికారులు సమాధానాలు అందించినట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు ఇవాళ మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

జూనియర్ లైన్‌మెన్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ సైదులు, నవ్య, సాజన్, ఖలీముల్లా, శివప్రసాద్ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏడీఈ ఫిరోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల17న జరిగిన జూనియర్ లైన్‌మెన్ పరీక్షల్లో నిందితులు అవకతవకలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

జూనియర్ లైన్​మెన్ అభ్యర్థులకు ఉద్యోగం ఇప్పిస్తామని రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అభ్యర్థుల నుంచి ఏజెంట్లు డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సెల్​ఫోన్​తో పరీక్షా కేంద్రంలోకి వెళ్తే జవాబులు చెరవేసేలా అభ్యర్థులతో ఒప్పందం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. మేడ్చల్​ జిల్లా ఘట్‌కేసర్‌లోని ఓ పరీక్షా కేంద్రంలోకి శివప్రసాద్ అనే అభ్యర్థి సెల్‌ఫోన్‌తో వెళ్లగా.. గుర్తించిన నిర్వాహకులు ఫిర్యాదుతో చేయడంతో ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో అభ్యర్థి శివప్రసాద్ వెనుక ముఠా ఉన్నట్లు తేల్చారు. తాజాగా ముఠా సభ్యులను కటకటాల వెనక్కి పంపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version