ఆరు నెలలకు రూ. కోటి జీతం..అయినా ఒక్కరూ అప్లై చేయడం లేదు..

-

పొట్టకూటి కోసం.. రాష్ట్రాలు దాటి మరీ వెళ్తున్నాం.. అయినవాళ్లను, ఉన్నఊరిని పక్కనపెట్టి..అంతంతమాత్రం జీతాలకోసం వలసపోతున్నవారు ఎందరో.. జీతం కాస్త బాగుంది అంటే.. రాష్ట్రాలే కాదు.. ఖండాలు కూడా దాటేస్తాం.. కానీ ఈ ఉద్యోగం కోసం మాత్రం ఎవరూ ముందుకురావడం లేదు.. జీతం ఏమైనా తక్కువ అంటే. రోజుకే రూ. 36 వేలు.. అంత శాలరీ ఇస్తుంటే.. బాగా పనిచెప్తారేమో అనుకోవచ్చు..పని తక్కువ..జీతం ఎక్కువ. ఉద్యోగ భద్రత కూడా ఉంది.. అయినా ఒక్కరూ ముందుకు రావడం లేదాయే.. దాదాపు 1 కోటి జీతం వచ్చే ఈ ఉద్యోగం ఇన్ని సౌకర్యాల తర్వాత కూడా ఎవరూ ఈ ఉద్యోగాన్ని ఎందుకు తీసుకోవడం లేదు..?

జాబ్‌ ఎక్కడంటే..

ఈ ఉద్యోగం స్కాట్ లాండ్‌ లని కోస్ట్ ఆఫ్ అబెర్డీన్‌లో ఇస్తున్నారు. స్కాట్లాండ్‌లోని అబెర్డీన్ తీరంలో ఉత్తర సముద్రంలో ఉన్న ఒక ఆఫ్‌షోర్ రిగ్గర్ ఉద్యోగం కోసం ఈ ప్రకటన ఇచ్చారు. ఆఫ్‌షోర్ రిగ్ అనేది నీటిపై లేదా నీటిలో ఉండే నిర్మాణం. ఇది బావులను డ్రిల్ చేయడానికి, చమురు, వాయువును సంగ్రహించడానికి, శుద్ధి చేయడానికి, దానిని భూమికి రవాణా చేసే వరకు నిల్వ చేయడానికి ఉపయోగించబడుతుంది.

రోజుకు రూ. 36 వేలు పైనే ఇస్తారట..!

నార్త్ సీ సమీపంలో అందిస్తున్న ఈ ఉద్యోగం 6 నెలల పాటు ఏకకాలంలో చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక వారం అనారోగ్య సెలవు కూడా ఇస్తారు. ఉద్యోగంలో ఒక రోజు షిఫ్ట్ 12 గంటలు ఉంటుంది. దీని కోసం మీకు రోజుకు 36 వేల రూపాయల కంటే ఎక్కువే ఇస్తారు. పని చేసే వ్యక్తి ఇక్కడ 2 సంవత్సరాలు ఉండి 6-6 నెలల 2 షిఫ్టులను పూర్తి చేస్తే అతని జీతం 95,420 యూరోలకి చేరుకుంటుంది, అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 1 కోటి. ఇప్పటి వరకు ఈ ఉద్యోగాన్ని ఆఫర్ చేసిన వారి పేరు తెలియదు, అయితే ఇది ఇంధన మార్కెట్లో పెద్ద కంపెనీ అని ఆ ప్రకటన చెబుతోంది.

అర్హతలు..

టిక్నిల్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్‌లో తప్పనిసరిగా BOSIET (బేసిక్ ఆఫ్‌షోర్ సేఫ్టీ ఇండక్షన్ మరియు ఎమర్జెన్సీ ట్రైనింగ్), FOET (మరింత ఆఫ్‌షోర్ ఎమర్జెన్సీ ట్రైనింగ్), CA-EBS (కంప్రెస్డ్ ఎయిర్ ఎమర్జెన్సీ బ్రీతింగ్ సిస్టమ్) మరియు OGUK మెడికల్ ట్రైనింగ్ వంటివి ఉండాలి.

ఇంత సౌకర్యం ఉన్నా

స్కాట్లాండ్‌లోని ఈ సైట్‌లో మెకానిక్ పని. దీనిలో సముద్రంలో ఉన్న రిగ్ నుంచి గ్యాస్ , చమురు తవ్వాలి. ఉద్యోగం కోసం వేర్వేరు తేదీలు, పర్యటనలు ఉన్నాయని, ఉద్యోగస్థులు స్వయంగా నిర్ణయించుకోవచ్చని యజమాని చెప్పారు. అయితే కార్మికుడు 6 నెలల పాటు రిగ్‌లో ఉండవలసి ఉంటుంది. నెల రోజులు గడిచినా ఈ పోస్టుకు 5 మంది కూడా దొరక్కపోవడానికి కారణం ఇదే. ప్రాణాలను ఫణంగా పెట్టి చేయాల్సి వస్తుందనే ఎవరూ ముందుకురావడం లేదేమో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version