తెలుగు పరిశ్రమ కోసం రూ. 600 కోట్లు విరాళంగా ఇచ్చిన నటుడు…?

-

సినీ ప్రముఖులు ఆరాధ్య దైవంగా భావించి ప్రభాకర్ రెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. భారతీయ చలనచిత్ర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ రెడ్డి తెలుగు సినిమాల్లో తన రచనలకు ప్రసిద్ధి చెందినవారు. ఇక మూడు దశాబ్దాలుగా 472 చిత్రాలలో నటించిన ప్రభాకర్ రెడ్డి కార్తీక దీపంతో సహా పలు ప్రశంసలు పొందిన చిత్రాలకు కథలను అందించడం జరిగింది. ఇక నాలుగు నంది అవార్డులను సైతం గెలుచుకున్నారు. ప్రభాకర్ రెడ్డి 1960లో గుత్తా రామినేడు దర్శకత్వం వహించిన చివరకు మిగిలేది చిత్రంలో సైకియాట్రిస్ట్ గా నటించారు.

ఇకపోతే అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమను మద్రాస్ నుండి హైదరాబాద్ కి తీసుకురావడానికి స్టార్ హీరోలు ఎంతో కష్టపడ్డారు. అలాంటి వారిలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా ప్రధమంగా నిలిచారు. ఇక వాళ్ళు హైదరాబాదుకి తెలుగు సినీ పరిశ్రమను తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా అప్పట్లో హైదరాబాదులో స్థలాలు వేల ధరలో ఉండేవి. కానీ ప్రస్తుతం వాటి విలువ కోట్లకు అమ్ముడుపోతున్నాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇకపోతే ప్రభాకర్ రెడ్డి తాను సినిమాలో నటిస్తున్నప్పుడే హైదరాబాదులోని సినీ కార్మికుల కోసం ఏకంగా 10 ఎకరాల భూమిని ఉచితంగా అందించేశారు.

ముఖ్యంగా అప్పట్లో ప్రభుత్వం.. సినిమా పరిశ్రమకి కొంత భూమిని ఉచితంగా ఇచ్చింది. అందులోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ స్టూడియోలను నిర్మించి స్టూడియోలను అద్దెకు ఇచ్చేవారు. కానీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తన సొంత 10 ఎకరాల భూమిని తెలుగు సినీ పరిశ్రమకు ఉచితంగా ఇవ్వడం ఆయన దయా హృదయానికి నిదర్శనమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ భూమి మీద పెద్ద పెద్ద భవనాలు కట్టించి సినిమా యాక్టర్లు ఆ బిల్డింగ్లలో నివసిస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి డాక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఆ స్థలం రూ. 600 కోట్లకు పైగా ఉంది . అప్పుడు ఎలాంటి రాబడి లేకుండా ఫ్రీగా తెలుగు పరిశ్రమకు ఎన్ని కోట్ల ఆస్తిని దానం చేశారు ప్రభాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version