దక్షిణాఫ్రికాలోని టౌన్‌షిప్ టావెర్న్ లో 21 మంది టీనేజర్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు ఎలా మరణించారనే విషయం తెలుసుకోవడానికి వారి మృతదేహాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు ఊహించని విషయాలను వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరీక్షలు ముగిశాయని ‘పెన్‌డౌన్’ పేరుతో విద్యార్థులు పార్టీ చేసుకుంటారని పేర్కొన్నారు. ఆ క్రమంలో నైట్ క్లబ్‌కు వెళ్లారని తెలిపారు. అక్కడ వెళ్లిన తర్వాత 21 మంది టినేజర్లు మృత్యవాత పడ్డారు. వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. దీంతో వారిపై విషప్రయోగం చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో 8 మంది విద్యార్థినులు, 13 మంది విద్యార్థులు ఉన్నారు.
అయితే టౌన్‌షిప్ టావెర్న్ లలో 18 ఏళ్లు పైబడిన వారికి మద్యపానం అనుమతిస్తారు. షెబీన్స్ లో అధికంగా మద్యంను సేవించడం వల్ల వారు చనిపోయి ఉంటారని ఫోరెన్సిక్ అధికారులు చెబుతున్నారు. కాగా, విద్యార్థుల మరణవార్త విని వారి తల్లిదండ్రులు నైట్‌క్లబ్‌కు చేరుకున్నారు. తమ పిల్లలను చూపించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా ప్రధానమంత్రి ఆస్కార్ మబుయానే తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఒకేసారి 21 మంది యువత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.