Breaking : ఆర్టీసీ బస్సులో షాట్‌సర్య్కూట్.. పూర్తిగా దగ్దం..

కర్నూలు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో జడ్చర్ల వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్ల వద్ద ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు ప్రమాద వశాత్తు పూర్తిగా దగ్ధమయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆర్టీసీ లగ్జరీ బస్సు కర్నూలు నుంచి హైదరాబాద్‌ వస్తున్నది. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాతీయ రహదారిపై జడ్చర్ల వద్ద బస్సులో షార్ట్‌సర్య్కూట్‌ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

TSRTC SUPER LUXURY towards Hyderabad. - YouTube

అయితే మంటలను గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు అందరినీ బస్సులో నుంచి దించివేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పిపోయింది. అయితే చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను ఇతరబస్సుల్లో తమ గమ్య స్థానాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.