ఐటీ పార్క్ లను హైదరాబాద్ నాలుగు మూలలకు విస్తరిస్తామని గతంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగ కండ్లకోయలో ఏర్పాటు చేయబోయే ఐటీ పార్క్ కు నేడు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గేట్ వే ఆఫ్ ఐటీ అనే పేరును కూడా సిద్ధం చేశారు.
మేడ్చల్ జిల్లాలోని గుండ్ల పోచం పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ ప్రాంతంలో ఈ ఐటీ పార్క్ ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనున్నారు. దాదాపు 10 ఎకరాల విస్తిర్ణంలో టీఎస్ ఐఐసీ అభివృద్ధి చేయనుంది. కండ్లకోయ లో ఏర్పాటు చేయబోయే ఐటీ పార్క్ ద్వారా స్థానికంగా కొత్తగా.. దాదాపు 50 వేలకు పైగా మంది ఉపాధి అవకాశాలు రానున్నాయి. కాగ రాష్ట్రంలో పలు కంపెనీలు కండ్లకోయ లో తమ నూతన కార్యాలయాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో మరిన్నీ ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉటుంది.