వారికి కేంద్రం శుభవార్త.. రూ.4 లక్షల బెనిఫిట్.. పూర్తి వివరాలు ఇవే..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీములతో ఎన్నో లాభాలు ఉంటాయి. కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన కూడా వున్నాయి. వీటినే జన సురక్ష స్కీమ్స్‌గా చెప్పుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు చూస్తే.. ఈ స్కీమ్స్ ని తీసుకు వచ్చి ఎనిమిది ఏళ్ళు అవుతుంది. ఈ స్కీమ్స్ లో చేరడం వలన ఎటువంటి లాభాలని పొందొచ్చు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రజల కోసం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా అనే రెండు మైక్రో ఇన్సూరెన్స్ స్కీమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ తో పేదలకి ఊరట కలగనుంది. కేంద్ర ప్రభుత్వం జీవన్ జ్యోతి బీమా యోజన ప్రీమియం ని గత ఏడాది జూన్ 1 నుంచి చూస్తే రూ. 330 నుంచి రూ. 436కు పెంచింది. సురక్ష బీమా యోజన ప్రీమియం అయితే రూ. 12 నుంచి రూ. 20కు పెంచేసింది. రూ. 456తో సామాన్యులు రూ. 4 లక్షల వరకు బెనిఫిట్ ని పొందవచ్చు.

ఇక అర్హత అయితే.. జీవన్ జ్యోతి బీమా యోజన కోసం 18 నుంచి 50 ఏళ్ల వయసు ఉండాలి. వారు మరణిస్తే రూ. 2 లక్షల బీమా వస్తుంది. సురక్ష బీమా స్కీమ్‌లో మరణిస్తే రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. అదే పాక్షిన అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష వస్తాయి. ఈ స్కీమ్ ని తీసుకు వచ్చినప్పటి నుండి 16.19 కోట్ల మంది చేరారు. ఇందులో చేరాలంటే బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి చేరొచ్చు. ప్రీమియం డబ్బులు ప్రతి ఏటా ఆటోమెటిక్‌గానే కట్ అయ్యేలా పెట్టచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version