హోటల్​లో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి

-

ఓ హోటల్ లో జరిగినన అగ్నిప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో పది మంది గాయపడ్డారు.  ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలోని హజ్రత్‌గంజ్‌ ప్రాంతంలోని లెవానా హోటల్‌లో చోటుచేసుకుంది.  ఇవాళ తెల్లవారుజామున హోటల్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. హోటల్‌లో మరికొంతమంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్న అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు కొనసాగించారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిప్రమాదం జరగ్గానే హోటల్‌లోని గ్యాస్‌ సిలిండర్లు, పేలుడుకు ఆస్కారం ఉన్నవాటిని వెంటనే అధికారులు బయటికి తీసుకువచ్చారు. హోటల్‌ మెుత్తం దట్టమైన పొగ అలుముకోవడం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలిగినట్లు అధికారులు తెలిపారు.  షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు.

ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌… గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ఘటనపై ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వెల్లడించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news