అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న నలుగురు తెలుగు వాళ్ళు అరెస్టు

-

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న నలుగురు తెలుగు వాళ్ళు అరెస్ట్ అయ్యారు. గిన్స్‌బర్గ్ లేన్‌లోని ఒక ఇంటిలో బయట పడ్డారు హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యక్తులు. అపస్మారక స్థితిలో ఉన్న పన్నెండు మంది యువతులను బంధించారు తెలుగు వ్యక్తులు. హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా ఇండియా నుంచి వీళ్ళని అమెరికాకు తీసుకొచ్చినట్లు గుర్తించారు. వీరితో పాటు ఎక్కువ మంది యువతులను కనుగొన్నారు ప్రిన్‌స్టన్ పోలీసులు.

ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆపరేషన్‌లో దాదాపు 100 మంది కంటే ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా తెలుగు వారి బారిన పడ్డ చాలా మంది బాధితులను గుర్తించామని తెలిపారు పోలీసులు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న చందన్ దసిరెడ్డి, ద్వారక గుండా , సంతోష్ కట్కూరి , మరియు అనిల్ మాలే అరెస్టు అయ్యారు. తెలుగు రాష్ట్రాల చెందిన నలుగురిని అరెస్ట్ చేసారు ప్రిన్‌స్టన్ పోలీసులు. హ్యూమన్ ట్రాఫికింగ్  ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతుందని అమెరికాలో జరిగిన ఈ ఘటనతో తేటతెల్లం అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version