ఇక నుండి సులభంగా మొబైల్ ఫోన్ తో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేయచ్చు..!

-

కేంద్ర ప్రభుత్వంలో భాగమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టు టాక్సెస్ (CBDT) సరికొత్త నిర్ణయం తీసుకుని ఇన్‌కంటాక్స్ చెల్లింపులను మరెంత ఈజీ చేసింది. జూన్ 7న సరికొత్త పోర్టల్ తెచ్చింది. www.incometax.gov.in ఇకపై దీని ద్వారా ఇన్‌కంటాక్స్ రిటర్నులను ఫైల్ చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

ఈ పోర్టల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. రిఫండులు కూడా వేగంగా జరుపుతారు. ఈ కొత్త పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా, అత్యాధునికంగా, ఏమాత్రం కష్టం లేకుండా పని పూర్తవుతుంది. ఇందులో ప్రధానంగా 5 ఫీచర్లు ఉన్నాయి. ఇందులో టాక్స్ చెల్లించడం చాలా తేలిక. పైగా ఇది ప్రజలకు అనుకూలంగా ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. రిఫండ్స్ చాలా వేగంగా వస్తాయి.

ఒకవేళ కనుక కొత్త పోర్టల్‌లో టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ కొత్తగా ఏర్పాటు చేసిన సెల్ సెంటర్‌ కి కాల్ చేసి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. యూజర్ మాన్యువల్స్, వీడియోలు, చాట్‌బోట్, లైవ్ ఏజెంట్ సదుపాయాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.

ఈ సింగిల్ డ్యాష్‌బోర్డులోనే పన్నులకు సంబంధించి అన్నీ ఉంటాయి. జూన్ 18న సరికొత్త పన్ను చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించాలనుకుంటోంది CBDT. ఐటీ శాఖ మొబైల్ యాప్ తెచ్చింది. మొబైల్ యాప్‌తో కూడా ఐటీ రిటర్నులను దాఖలు చెయ్యవచ్చు. ITRలు 1 నుంచి 4 వరకూ (ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్), అలాగే ITR 2 (ఆఫ్ లైన్) అందుబాటులో ఉంటాయి. ఇక ITRలు 3, 5, 6, 7 దాఖలు చేయడానికి కూడా చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version