తెలంగాణలో టీఎస్పిఎస్సి పేపర్ లీక్ విషయం ముదురుతోంది.. ఈ గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడడంతో బాధపడిన విద్యార్థులు అంతా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృదా చేసుకుంటున్నారు. అయితే పేపర్ లీక్ అయిన కారణం చూపుతూ పరీక్షను రద్దు చేయడం సమంజసం కాదని పలు రకాల వాదనలతో విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రోడ్లపై తమ నిరసన తెలుపుతూ ప్రభుత్వం పై తమ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాగా విద్యార్థులు చేస్తున్న నిరసనలు శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని పోలీసులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను అరెస్ట్ చేయగా…ఇపుడు అది సంచలనంగా మారింది. జైలుకు తీసుకెళ్లిన విద్యార్థులకు అండగా నిలవాలన్న నినాదాలు గట్టిగా వినపడుతున్నాయి.
విద్యార్ధులు, నిరుద్యోగులు అందరూ కూడా వారికి మద్దతు పలికేందుకు నడుం బిగిస్తున్నారు. తాజాగా ప్రజానాయకుడు గద్దర్ ఈ విషయం పట్ల బాగా ఆలోచించి విద్యార్థులు మరియు నిరుద్యోగులను చైతన్య పరుస్తూ… మీ మీ ఊర్లలో ఉన్న వారికి జరిగిన విషయాన్ని చెప్పండి.. అంతే కాకుండా ఎక్కడ రచ్చబండకు వెళ్ళొద్దని చెప్పండి. పార్టీలతో సంబంధం లేకుండా ఈ సమస్య కోసం మనమంతా ఏకమై పోరాడుదాం అంటూ గద్దర్ వ్యాఖ్యలు చేశారు.