రాజస్థాన్ లో దారుణం.. నలుగురు విద్యార్థినిలపై మొత్తం స్కూల్ టీచర్ల అత్యాచారం..

-

విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులే చెరబట్టారు. చెడు పనులు చేయవద్దని భోదించాల్సిన వారే చెడ్డ పనులు చేశారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉపాధ్యాయ ఉద్యోగ విలువలనే దిగజార్చారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా స్కూల్ లోని అందరు టీచర్లు.. నలుగురు విద్యార్థినిలపై అత్యాచారానికి తెగబడ్డారు. వీరికి మహిళా టీచర్లు కూడా వత్తాసు పలికారు. ఈ దారుణమైన సంఘటన రాజస్థాన్ అళ్వార్ జిల్లా బివాడీ ప్రాంతంలో చోటు  చేసుకుంది.

RAPE

వివరాల్లోకి వెళితే…రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని భివాడి ప్రాంతంలో తమపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన పాఠశాల ఉపాధ్యాయులపై నలుగురు పాఠశాల బాలికలు పోలీసుకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ సహోద్యోగిని వేధింపుల కేసులో జైలుకు పంపారనే ప్రతీకారంతో ప్రిన్సిపాల్ తో పాటు 14 మంది ఉపాధ్యాయులు నలుగురు విద్యార్థినిలపై అత్యాచారం చేశారు. దీనికి 5 గురు మహిళా ఉపాధ్యాయ సిబ్బంది కూడా సహకరించారు. ఏడాది కాలంగా బాలికలు ఈ దారుణానికి లోనువున్నారు.

8, 9, 10వ తరగతి చదువుతున్న బాలికల తల్లిదండ్రులు స్కూల్ టీచర్లు అత్యాచారానికి పాల్పడుతున్నారని  మంగళవారం స్థానిక మండన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్‌తో సహా ప్రభుత్వ పాఠశాలలోని 15 మంది ఉపాధ్యాయులపై రేప్, పోక్సో కేసులు నమోదు చేశారు. ఐదుగురు మహిళలు సహా 15 మంది ఉపాధ్యాయులపై గత రాత్రి అల్వార్‌లోని పోలీస్ స్టేషన్‌లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news