గంగవ్వకు గుండెపోటు.. విష్ణుప్రియకు రాత్రంతా చెమటలు.. చివరకు ఏమైందంటే?

-

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్-8 ఉత్కంఠగా సాగుతోంది. షో ప్రారంభంలో 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. ఎవరికి వారు తమ టాలెంట్‌తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. అయితే, సీజన్ -8లో పెద్దగా ఎవరూ తెలిసిన మొహాలు లేకపోవడంతో కొద్ది రోజులు షో కాస్త చప్పగా సాగింది. పెద్దగా టాక్ కూడా రాలేదు. ఈ క్రమంలోనే గంగవ్వను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హోస్ట్ నాగార్జున పిలిపించారు.

గతంతో సీజన్ 4లోనూ గంగవ్వ పార్టిసిపేట్ చేసిన విషయం తెలిసిందే.అప్పట్లో వయస్సు రీత్యా తను రిక్వెస్ట్ చేసి మరీ బయటకు వెళ్లిపోయింది. తాజాగా మరోసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టడంతో ప్రస్తుతం షో కాస్త సందడిగా మారింది. ఓ వైపు కంటెస్టెంట్లు వీక్లీ ఎలిమినేషన్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజా ఎపిసోడ్‌లో రాత్రి గంగవ్వకు గుండెపోటు వచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ టైంలో యాంకర్ విష్ణుప్రియకు చెమటలు పట్టాయని, కంటెస్టెంట్లు తీవ్ర భయాందోళనకు గురవ్వడంతో బిగ్ బాస్ వైద్యులను పిలిపించి ట్రీట్మెంట్ అందించినట్లు కథనాలు వస్తున్నాయి. కాగా, ఇవన్నీ రేటింగ్స్ కోసం చేసిన స్టంట్స్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version