వైకాపాలోకి టీడీపీనేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వస్తున్నారని.. సైకిల్ దిగి ఫ్యాన్ కింద సేదతీరాలని భావిస్తోన్నారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. మొదట్లో ఇవి పూర్తిగా ఊగాహాణాలు అని కొట్టిపారేసినా… ఇప్పటికీ టీడీపీలో ఉన్న గంటాపై ఆ పార్టీ అనుకూల మీడియా అటాక్స్ స్టార్ట్ చేయడంతో.. “వైకాపాలోకి గంటా”పై పూర్తిక్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో గంటాకు విజయసాయిరెడ్డి రూపంలో భారీ అడ్డంకు ఉందని అన్నారు! అయితే… అది కూడా పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ… అసలు సమస్యలో హస్తిన కేంద్రంగా ఉందన్ని చెబుతున్నారు!!
అవును… హస్తిన కేంద్రంగా గంటాకు మంచి సర్కిల్ ఉందంట! వారిలో మెజారిటీ పెద్దలు.. గంటా శ్రీనివాస్ బీజేపీలో చేరితే బాగుంటుందని అంటున్నారట. అయితే… ఎంపీ, రాజ్యసభలకంటే ఏపీలో మంత్రిగా చక్రం తిప్పడంపైనే గంటాకు మక్కువ ఎక్కువ అని అంటున్నారు. ఇందులో భాగంగా.. గంటా శ్రీనివాస్ వైకాపా వైపు చూస్తున్నారట. అయితే… గత ప్రభుత్వ హయాంలో గంట మంత్రిగా అవినీతికి పాల్పడ్డారన్న రేంజ్ లో ఇప్పటికే విజయసాయిరెడ్డి ఇరకాటంలో పెట్టిన సంగతి తెలిసిందే!ఇ క్రమంలో హస్తిన సర్కిల్ మాటవైపే గంటా మొగ్గుచూపుతున్నారని అంటున్నారు!
సాయిరెడ్డిని కాదని గంటా.. వైకాపాలో చేసేది ఏమీ ఉండకపోవచ్చు! ఈ సమయంలో అంత రిస్క్ చేసి వైకాపాకు వెళ్లడం కంటే… ప్రస్తుతం గంటా సామజికవర్గానికి బీజేపీలో – ఏపీ బీజేపీలో పెద్ద పీట వేస్తోన్న క్రమంలో… పైగా బీజేపీకి – వైకాపాకు హస్తిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేని పరిస్థితుల్లో… అటువైపు చూడటమే బెటర్ అనేది హస్తిన సర్కిల్ మాటలను బట్టి గంటా ఆలోచిస్తున్నారని అంటున్నారు!! ఫైనల్ గా ఆ ఆలోచన ప్రకారమే గంటా నిర్ణయాలు తీసుకుంటే… అన్ని రకాలుగానూ సేఫ్ అంటున్నారట ఆయన వర్గం ప్లస్ ఢిల్లీ సర్కిల్!