కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే తాజాగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2022 పరీక్ష కూడా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నిజంగా ఈ పరీక్షలు వాయిదా పడ్డాయా లేదు అంటే ఇది నకిలీ వార్త అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా నకిలీ వార్తలు మనం వింటున్నాం. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా విపరీతమైన నకిలీ వార్తలు పుట్టుకొస్తున్నాయి.
అందుకని వాటి తో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇంతకీ పరీక్ష వాయిదా పడిందా లేదా అనే విషయానికి వస్తే.. గేట్ 2022 పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇటీవలే వచ్చిన ప్రకటన అభ్యర్థుల్లో మరింత గందరగోళానికి కారణమైంది. తాజాగా గేట్ 2022 పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉండొచ్చు లేదు అంటే పరీక్షలు జరగవచ్చు అని చెప్పడం జరిగింది.
ఇప్పటికే అడ్మిట్ కార్డు విడుదలకు ముందు రెండు సార్లు పరీక్ష వాయిదా పడింది. ఇప్పుడు కూడా పరీక్ష వాయిదా పడుతుందని చాలా మంది అనుకుంటున్నారు. అయితే వచ్చిన నకిలీ వార్తలో నిజం లేదు. ఇప్పటి వరకు అయితే పరీక్షలు వాయిదా పడలేనట్టు తెలుస్తోంది. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించడం మంచిది.