ఏపీలోని 26 కొత్త జిల్లాల భౌగోలిక స్వరూపం..అత్యధిక జనాభా ఉన్న జిల్లాలు ఇవే

-

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. 1974 ఏపీ జిల్లాల (ఏర్పాటు) చట్టంలోని సెక్షన్-3(5) ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు చేసేందుకు జగన్‌ సర్కార్‌ సిద్ధమైంది. అయితే.. కొత్తగా ఏర్పాటు అవుతున్న 26 జిల్లాల భౌగోలిక స్వరూపం ఒక సారి చూద్దాం.

జిల్లా పేరు : అనకాపల్లి

జిల్లా కేంద్రం: అనకాపల్లి
నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి)
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం(10),అనకాపల్లి(15) మొత్తం మండలాలు 25
వైశాల్యం : 4,412 చ.కి.మీ,
జనాభా : 18.73 లక్షలు

జిల్లా పేరు : తూర్పుగోదావరి
జిల్లా కేంద్రం: కాకినాడ
నియోజకవర్గాలు: 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం)
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం(12),కాకినాడ(7) మొత్తం మండలాలు 19
వైశాల్యం : 2,605 చ.కి.మీ
జనాభా : 19.37 లక్షలు

జిల్లా పేరు : కోనసీమ
జిల్లా కేంద్రం: అమలాపురం
నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం)
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం(8), అమలాపురం(16) మొత్తం మండలాలు 24
వైశాల్యం: 2,615 చ.కి.మీ
జనాభా: 18.73 లక్షలు

జిల్లా పేరు : రాజమహేంద్రవరం
జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
నియోజకవర్గాలు: 7 (అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(10) మొత్తం మండలాలు 20
వైశాల్యం: 2,709 చ.కి.మీ
జనాభా: 19.03 లక్షలు

జిల్లా పేరు : నరసాపురం
జిల్లా కేంద్రం: భీమవరం
నియోజకవర్గాలు: 7 (ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం(8), కొత్తగా భీమవరం(11) మొత్తం మండలాలు 19
వైశాల్యం: 2,178 చ.కి.మీ
జనాభా: 17.80 లక్షలు

జిల్లా పేరు : పశ్చిమగోదావరి
జిల్లా కేంద్రం: ఏలూరు
నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు)
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు(12),జంగారెడ్డిగూడెం(9), నూజివీడు(6) మొత్తం మండలాలు 27
వైశాల్యం: 6,413 చ.కి.మీ
జనాభా: 20.03 లక్షలు

జిల్లా పేరు : పొట్టి శ్రీరాములు నెల్లూరు
జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు : 8 కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు (12), ఆత్మకూరు (11), కావలి(12) మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,141 చ.కి.మీ
జనాభా : 23.37 లక్షలు

జిల్లా పేరు : కర్నూలు
జిల్లా కేంద్రం: కర్నూలు
నియోజకవర్గాలు : 8 పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17) మొత్తం మండలాలు 28
వైశాల్యం : 8,507 చ.కి.మీ
జనాభా : 23.66 లక్షలు

జిల్లా పేరు : నంద్యాల
జిల్లా కేంద్రం: నంద్యాల
నియోజకవర్గాలు : 6 నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్‌ (8), కొత్తగా ఆత్మకూరు(10) మొత్తం మండలాలు 27
వైశాల్యం : 9,155 చ.కి.మీ
జనాభా : 16.87 లక్షలు

జిల్లా పేరు : కృష్ణా
జిల్లా కేంద్రం: మచిలీపట్నం
నియోజకవర్గాలు: 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12) మొత్తం మండలాలు 25
వైశాల్యం: 3,775 చ.కి.మీ
జనాభా: 17.35 లక్షలు

జిల్లా పేరు : ఎన్టీఆర్
జిల్లా కేంద్రం: విజయవాడ
నియోజకవర్గాలు: 7 (విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు)
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7) మొత్తం మండలాలు 20
వైశాల్యం: 3,316 చ.కి.మీ
జనాభా: 22.19 లక్షలు

జిల్లా పేరు : గుంటూరు
జిల్లా కేంద్రం: గుంటూరు
నియోజకవర్గాలు: 7 (తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8) మొత్తం 18 మండలాలు
వైశాల్యం: 2,443 చ.కి.మీ
జనాభా: 20.91 లక్షలు

జిల్లా పేరు : బాపట్ల
జిల్లా కేంద్రం: బాపట్ల
నియోజకవర్గాలు : 6 వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల
రెవెన్యూ డివిజన్లు : కొత్తగా బాపట్ల(12), కొత్తగా చీరాల (13) మొత్తం మండలాలు 25
వైశాల్యం : 3,829 చ.కి.మీ
జనాభా : 15.87 లక్షలు

జిల్లా పేరు : పల్నాడు
జిల్లా కేంద్రం: నరసరావుపేట
నియోజకవర్గాలు : 7 పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి
రెవెన్యూ డివిజన్లు : గురజాల (14), నరసరావుపేట(14) మొత్తం మండలాలు 28
వైశాల్యం : 7,298 చ.కి.మీ
జనాభా : 20.42 లక్షలు

జిల్లా పేరు : ప్రకాశం
జిల్లా కేంద్రం: ఒంగోలు
నియోజకవర్గాలు : 8 యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13) మొత్తం మండలాలు 38
వైశాల్యం : 14,322 చ.కి.మీ
జనాభా : 22.88 లక్షలు

Read more RELATED
Recommended to you

Exit mobile version