పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అయితే ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. పైగా మంచిగా లాభాలని పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యడం ద్వారా పొందొచ్చు. బ్యాంక్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ కంటే ఇక్కడ డబ్బు పెట్టడం సురక్షితం.
పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే కచ్చితమైన రాబడి వస్తుంది. పోస్టాఫీస్ అందించే స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ను కావాలంటే మీ పిల్లల పేరు పై కూడా ఓపెన్ చెయ్యచ్చు.
ఈ డబ్బుని మీరు దాచుకున్న ఐదేళ్ల తరవాత తీయచ్చు. ఈ స్కీమ్ ద్వారా మీరు మెచ్యూరిటీ సమయంలో రూ.1.5 లక్షల వరకు పొందొచ్చు. రోజుకు రూ.70 పొదుపు చేసారంటే అంటే నెలకి రూ.2,100 ఇందులో పెడితే ఐదేళ్ల తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ.1.26 లక్షలు వస్తాయి.
ఈ స్కీమ్‌పై 5.8 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. మీరు ఐదేళ్ల పాటు డబ్బులు పెడితే మీకు రూ.20 వేలకు పైగా వడ్డీ వస్తుంది. రికరింగ్ డిపాజిట్ అకౌంట్లో వడ్డీ మొత్తాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ఈ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి కూడా డిపాజిట్ చేయచ్చు.