జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. కాగ 2022-23 వార్షిక సంవత్సరానికి గాను జీహెచ్ఎంసీ బడ్జెట్ ను రూ. 6,150 కోట్లుగా అంచనా వేసింది. కాగ హౌసింగ్ కాంపొనెంట్ కోసం మరో రూ. 406.70 కోట్లను అధనంగా కేటాయింది. దీంతో మొత్తం బడ్జెట్ రూ. 6,556.70 కోట్లకు చేరింది. జీహెచ్ఎంసీ ముసాయిదా బడ్జెట్ లో రెవెన్యూ రాబడుల ద్వారా రూ. 2,800 కోట్లు, మూలధన వ్యయంగా రూ. 3,350 కోట్లు ఉన్నాయి.
కాగ ఈ బడ్జెట్ ముసాయిదాలను ఈ రోజు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీలో ప్రవేశ పెట్టారు. కాగ ఈ బడ్జెట్ కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. కాగ ప్రతిపాద బడ్జెట్ చూస్తే.. గత వార్షిక బడ్జెట్ లో రూ. 5,600 కోట్లుగా ఉంది. కాగ వార్షిక బడ్జెట్ లో రూ. 6,150 కోట్లకు పెంచింది.
కాగ గత ఏడాది హౌసింగ్ కాంపొనెంట్ కు రూ. 1,241.87 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది కేవలం రూ. 406.70 కోట్లను మాత్రమే కేటాయింది. కాగ ప్రాపర్టీ ట్యాక్స్ రూ.1700 కోట్లు, టౌన్ ప్లానింగ్ రూ.1200 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ రూ. 63 కోట్లు, 15వ ఫైనాన్స్ (పట్టణ ప్రగతి) రూ.708 కోట్లు, టీడీఆర్ ద్వారా 500 కోట్లు వస్తాయని అంచనా వేశారు.