ప్రపంచ వ్యాప్తంగా పెగరుతున్న భూతాపం, కర్భన ఉద్గారాల కట్టడి కోసం ప్రపంచ దేశాల నేతలు కాప్ 26 సమావేశంలో చర్చించనున్నారు. దీని కోసం బ్రిటన్ స్కాట్లాండ్ లోనిగ్లాస్గోలో 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP26) జరుగనుంది. దీని కోసం ప్రధాన మోదీ ఇటలీలో జరిగిన జీ 20 సమావేశం అనంతరం యూకే చేరుకున్నారు. గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పారిస్ ఒప్పందాన్ని అమలు చేయడమే మార్గమని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా, అనుసరించాల్సిన వ్యూహాలపైనా స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో కాప్– 26 సదస్సు ఆదివారం ప్రారంభమైంది. దాదాపు 200 దేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలు, పర్యావరణ పరిరక్షకులు పాల్గొనే ఈ సదస్సు రెండు వారాల పాటు కొనసాగనుంది. భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడమే కాప్ 26 లక్ష్యం. ఆరేళ్ల క్రితం జరిగిన పారిస్ ఒప్పందంలో భూమి ఉష్టోగ్రత పెరుగుదలను 2 డిగ్రీలకే పరిమితం చేాయాలని ప్రపంచ దేశాలు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరగుతున్న కాప్ 26 సమావేశానికి భారత సంతతికి చెందిన బ్రిటన్ మంత్రి అలోక్ శర్మ అధ్యక్షత వహించనున్నారు. వాతావరణ మార్పులు, కర్భన ఉద్గారాల తగ్గింపుపై నేడు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.