కామన్వెల్త్ గేమ్స్‌ లో భవీనా పటేల్‌కు గోల్డ్ మెడల్

-

కామన్వెల్త్ గేమ్స్‌ లో భారత్‌ మరో స్వర్ణం గెలుచుకుంది. పారాలింపిక్ సిల్వర్ మెడల్ విజేత భవీనా బెన్ పటేల్ మరోసారి సత్తా చాటారు. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్ క్లాస్ ఫైనల్‌లో నైజీరియా ప్లేయర్ ఈఫెచుక్‌వడేపై గెలుపుతో గోల్డ్ మెడల్ సాధించింది. 12-10, 10-2, 11-9 తేడాతో భారత్ గెలిచింది. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్ టేబుల్ టెన్నిల్‌లో బంగారు పతకం సాధించిన తొలి ప్లేయర్‌గా భవీనా బెన్ పటేల్ రికార్డుల్లో నిలిచారు.

భవీనా పటేల్

ఇప్పటికే పారా వెయిట్ లిఫ్టింగ్‌లో సుధీర్‌కు స్వర్ణం లభించింది. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్ లో భారత్‌ 40 పతకాలతో 5వ స్థానంలో రేసులో ఉంది. ఇందులో 12 గోల్డ్ మెడల్‌లు, 11 సిల్వర్ మెడల్‌లు, 16 బ్రోన్జ్ మెడన్‌లు వచ్చాయి. కాగా, 155 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో ఇంగ్లాండ్ (148), మూడవ స్థానంలో కెనడా (84), నాలుగవ స్థానంలో న్యూజిలాండ్ (44) దేశాలకు వరుసగా పతకాలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version