రేపటి నుంచి గోల్కొండ, జులై 5 నుంచి బల్కంపేట బోనాలు

-

రేపే గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనాలు ప్రారంభం కానుందని ప్రకటించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. జులై 5 న అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నిర్వహిస్తామని చెప్పారు. అమ్మవారి కళ్యాణం సందర్భంగా నూతన చీర తయారీని ఆలయ ఆవరణలో ప్రారంభించిరు మంత్రి తలసాని.

ఈ సారి అమ్మవారి కల్యాణానికి 5 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నామని.. అమ్మవారి కల్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి KCR ఆధ్వర్యంలో అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 30 నుండి ప్రారంభమయ్యే బోనాలను ఘనంగా నిర్వహించేలా ముమ్మర ఏర్పాట్లు చేశామని… గురువారం నుండి గోల్కొండ బోనాలు ప్రారంభం అని చెప్పారు తలసాని. జగదాంబ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news