Breaking : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

-

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వం హెచ్ఆర్ఏను పెంచుతున్నట్లు తెలిపింది. 12 శాతం నుంచి 16 శాతానికి హెచ్ఆర్ఏను పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పార్వతీపురం, పాలేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నర్సారావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుంది.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 2022 జనవరి 1 నుంచి పెండింగ్ లో ఉన్న డీఏను మంజూరు చేస్తున్నట్టు మే 1న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెండు జీవోలు విడుదల చేసింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ జీవో నెం.66… పెన్షనర్లకు డీఏ మంజూరు చేస్తూ జీవో నెం.67 తీసుకువచ్చారు. ఈ డీఏను ఈ ఏడాది జులై 1 నుంచి జీతంతో కలిపి ఇవ్వనున్నారు. డీఏ బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు సమాన వాయిదాలలో చెల్లిస్తారని తెలుస్తోంది. కాగా, తాజా డీఏతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ శాతం 22.75కి పెరుగుతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version