కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులు తమ జీతానికి సంబంధించి త్వరలో మూడు సుభవార్తలను అందుకోనున్నారు. డియర్నెస్ అలవెన్స్ జనవరి, జూలైలో సంవత్సరానికి రెండుసార్లు సవరించబడుతుంది. అందుకే ఇది వచ్చే నెలలో సవరించబడుతుంది. మీడియా నివేదికల ప్రకారం.. డీఏ తో పాటు ఉద్యోగులు 18 నెలల బకాయిలు, ప్రావిడెంట్ ఫండ్(PF) పై వడ్డీని కూడా పొందవచ్చు.
నివేదిక ప్రకారం జనవరి 2020 నుండి జూన్ 2021 వరకు 18 నెలల డీఏ బకాయిల చెల్లింపు సమస్య త్వరలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒకేసారి రూ.2 లక్షల బకాయిలను పొందవచ్చు. ఉద్యోగుల భవిష్య నిధి పై ప్రభుత్వం ఇప్పటికే వడ్డీరేటును నిర్ణయించింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఇప్పుడు పిఎఫ్ ఖాతాదారుల ఖాతాలో వడ్డీని జమ చేస్తోంది. 2021- 22 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ఈపీఎఫ్ పై 8.10 శాతం వడ్డీ రేటును ఆమోదించింది.