ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులు త్వరలోనే ఓ గుడ్ న్యూస్ ను చెప్పనుంది..ప్రస్తుతం ఉన్న పెన్షన్ మూడు రేట్లు పెరగనున్నట్లు సమాచారం. ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం వచ్చే నెలలో జరగనుందని నివేదికలో పేర్కొన్నారు. కనీస పెన్షన్‌ను మూడు రెట్లు పెంచడంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కనీస పింఛను ప్రస్తుతం రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచవచ్చు. లేబర్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ ఈ విషయంలో తన నివేదికను త్వరలో సమర్పించనుంది.
ఈ నిర్ణయం దాదాపు 6.5 లక్షల మంది పెన్షనర్లు, 5 కోట్ల EPFO చందాదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాదు..సీబీటీ ఈక్విటీ పరిమితిని 15 శాతం నుంచి 25 శాతానికి పెంచడంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఈక్విటీలో పెట్టుబడి పెంపుదలకు కార్మిక సంఘం అనుకూలంగా లేదని తెలుస్తోంది.ఇందుకు కారణం కూడా ఉంది.. స్టాక్ మార్కెట్ లో ఏర్పడిన పరిస్థితులు కారణమని స్పష్టం అవుతుంది.
ఇకపోతే ఇటీవల ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు షాకిస్తూ సబ్‌స్క్రైబర్లకు షాకిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ రేటును ప్రకటించింది.
ఇది నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.5 శాతం ఉండేది. ఆ తర్వాత 8.5 శాతం కు చేసింది.ఈక్విటీలలో పెట్టుబడిని పెంచడం ద్వారా రాబడిని పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు రెండు వారాల క్రితం ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ ముఖ్యమైన సమావేశం జరిగింది..వీటి గురించి ప్రత్యేకంగా చర్చించారు..