తెలంగాణలోని ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభవార్త చెప్పారు. నిన్న మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ని తెలంగాణ అబారీ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. డిపార్ట్‌మెంట్‌లో గత సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న సీఐ, ఎస్‌ఐ మినిస్ట్రియల్ సిబ్బంది, కానిస్టేబుల్, కెమికల్ లాబ్ ఉద్యోగుల పదోన్నతులు ఆగిపోయాయని, వాటిని త్వరగా ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ ను కోరారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని అధికారులకు భరోసా ఇచ్చారు మంత్రి శ్రీనివాస్.
మంత్రిని కలిసిన వారిలో టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, ఆబారీ శాఖ అధ్యక్షుడు టి.రవీందర్ రావు, ప్రధాన కార్యదర్శి డి.అరుణ్ కుమార్, కోశాధికారి టి.లక్ష్మణ్ గౌడ్, బి.ప్రవీణ్ కుమార్, కె.శ్రీనివాస్, ఎం.రవీంద్ర, ఎస్.చంద్రశేఖర్ గౌడ్, సాధిక్ అలీ, నరేందర్, చిరంజీవి, రాజశేఖర్, కె.రాజు, రామ్మూర్తి, భాసర్ రావు, ప్రసాద్, పవన్, సమ్మయ్య, ప్రభాకర్‌లతో పాటు కానిస్టేబుల్ అసోసియేషన్ ప్రతినిధులు నాగరాజు, అనంత్ రెడ్డి, మల్లేశ్, తదితరులు ఉన్నారు.