రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రూ.42 వేలు పొందే అవకాశం..

-

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో రకాల గుడ్ న్యూస్ లను అందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..వీటిల్లో మనం ఇప్పుడు రెండు స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ పథకాల ద్వారా రైతులకు ఏటా రూ. 42 వేలు లభిస్తాయని చెప్పుకోవచ్చు.. అందులో ఒకటి ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ అందరికీ తెలిసిందే. ఈ స్కీమ్‌లో చేరిని వారికి మోదీ సర్కార్ ఏటా రూ. 6 వేలు ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. విడతల వారీగా వస్తున్నాయి… ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి మూడు విడుతలుగా అకౌంట్ లోకి వస్తాయి..

అలాగే భారత ప్రభుత్వం అన్నదాతల కోసం మరో పథకాన్ని కూడా అందిస్తోంది. దీని పేరు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఈ స్కీమ్‌లో చేరడం ద్వారా రైతులకు ప్రతి నెలా రూ. 3 వేలు లభిస్తాయి. అంటే ఏడాదికి రూ. 36 వేలు పొందొచ్చు.. అయితే రైతు ఈ డబ్బుల కోసం నెలకు రూ.55 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది.అన్నదాతల వయసు ప్రాతిపదికన చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది. 18 ఏళ్ల వయసులోనే ఈ స్కీమ్‌లో చేరితే నెలకు . 55 కడితే సరిపోతుంది. గరిష్టంగా రూ. 200 కట్టాల్సి వస్తుంది..ఇలా ప్రతి నెలా డబ్బులు కడుతూ వెళ్లాలి. లేదంటే బ్యాంక్ అకౌంట్‌కు ఆటో డెబిట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ప్రతి నెలా ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతూ వస్తాయి.

రైతులకు ఇకపోతే 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతి నెలా రూ. 3 వేలు వస్తాయి. కాగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్‌లో 18 నుంచి 40 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు మాత్రమే చేరడానికి ఛాన్స్ ఉంటుంది. దగ్గరిలోని మీసేవ కేంద్రానికి వెళ్లి ఈ పథకంలో ఉచితంగా చేరొచ్చు.ఈ పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే అప్పుడు వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో కలిపి వెనక్కి చెల్లిస్తారు. లేదంటే భాగస్వామి ఈ స్కీమ్‌ను కొనసాగించొచ్చు. స్కీమ్‌లో వ్యక్తి మరణిస్తే.. భాగస్వామికి రూ.1500 పెన్షన్ వస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version