కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు మరో కానుక ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. సెంట్రల్ గవర్న్‌మెంట్ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ ని పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్రం హెచ్‌ఆర్ఏను కూడా పెంచనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పెంపు త్వరలోనే ఉంటుంది అని అంటున్నారు.
దీనితో శాలరీ మరెంత పెరుగుతుంది. ఇది ఇలా ఉంటే డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచడంతో ప్రస్తుతం హౌస్ రెంట్ అలవెన్స్, ఇతర అలవెన్స్‌లను పెంచేందుకు సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధం అవుతోంది. డీఏను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 3 శాతం పెంచి 34 శాతానికి తీసుకు వచ్చింది. డీఏ పెరిగిన తర్వాత హెచ్‌ఆర్ఏ కూడా పెరుగుతుంది. దీంతో హెచ్‌ఆర్ఏ పెంపుపై అంచనాలు పెరిగాయి.
గత సంవత్సరం జూలైలో హెచ్‌ఆర్ఏ ని పెంచారు. అప్పుడే డీఏను ప్రభుత్వం 25 శాతం నుంచి 28 శాతానికి పెంచింది. ప్రస్తుతం ఈ డీఏను 34 శాతానికి చేర్చడంతో హెచ్‌ఆర్ఏ అలవెన్స్‌లను లో కూడా మార్పు చేయనున్నారు. అయితే ఉద్యోగులు పని చేసే నగరాన్ని బట్టి హెచ్‌ఆర్ఏను కౌంట్ చెయ్యడం జరుగుతుంది.
మూడు కేటగిరీలలో X, Y , Z సిటీలను వర్గీకరిస్తారు. X కేటగిరీ కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్ఏ పెంపు డీఏకు అనుగుణంగా మూడు శాతం ఉంటుంది. అదే Y కేటగిరీ సిటీల లో అయితే హెచ్‌ఆర్ఏ పెంపు 2 శాతం ఉండే అవకాశం ఉంది. Z కేటగిరీ సిటీల వారికి, 1 శాతం పెంపు ఉండనుంది.