ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నవరత్నాల్లోని పథకంలో భాగంగా ఇల్లు కట్టుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకంలో ఇల్లు కట్టుకునే వారికి ఇప్పుడు ఇస్తున్న సిమెంట్ బస్తాలకు అదనంగా మరో 50 బస్తాల సిమెంట్ ను ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో ఇళ్లు కట్టుకునే వారికి రూ. 240 చొప్పున 90 బస్తాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది.
అయితే తాజా గా సిమెంట్ బస్తా రెట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఒక సిమెంట్ బస్తా ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 400 కు చేరుకుంది. దీంతో ఈ పథకంలో ఇల్లు కట్టుకునేవారికి సిమెంట్ కష్టాలు ఎదురు అవుతున్నాయి. దీంతో ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన సిమెంట్ ధరలకు అనుగూణంగా మరో 50 సిమెంట్ బస్తాలను రాయితీపై ఇవ్వాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకంతో ఇల్లు నిర్మించుకుంటున్న లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.