ఒక్కయుద్దం సుందర దేశాన్ని మసిదిబ్బలా మార్చేసింది. ఉక్రెయిన్ ప్రజల సంతోషాన్ని వారి నుంచి దూరం చేసింది రష్యా. నిన్న మొన్నటి వరకు పచ్చని చెట్లు, ఆకాశ హర్మ్యాలతో ఎంతో సుసంపన్నంగా ఉన్న ఉక్రెయిన్ నేడు మాత్రం ఆ కళను కోల్పోయి కళావిహీనంగా మారింది. అందమైన ఉక్రెయిన్ రాజధాని కీవ్ బాంబులతో మోతమోగుతోంది. రెండో పెద్ద పట్టణం ఖార్కీవ్ కళ కోల్పోయింది. మరియోపోల్, సుమీ, మెలిటోపోల్, ఎల్వీవ్ ఇలా అన్ని నగరాలపై రష్యా దమనకాండ కొనసాగుతోంది. రష్యా యుద్ధ విమానాల నుంచి వచ్చే క్షిపణులు చారిత్రాత్మక భవనాలను నిట్టనిలువగా కూలుస్తున్నాయి.
రష్యా యుద్ధం వల్ల తమ దేశంలో జరిగిన విధ్వంసాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. యుద్ధం ముందు తమ దేశం ఎలా ఉండేదో.. యుద్ధం వల్ల ఎలా అయిందో చూపిస్తూ.. ఓ భావోద్వేగ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ప్రజల చేత కన్నీరు పెట్టిస్తోంది. ప్రజలు ఎంత తీవ్రంగా బాధపడుతున్నారో… ఆవేదన చెందుతున్నారో చూపిస్తూ వీడియోను షేర్ చేశారు. ఉక్రెయిన్ పై రష్యా దాడికి మూడు వారాలు గడిచిపోయాయి. దేశంలో ప్రధాన నగరాలు పట్టణాలు రష్యా దాడుల వల్ల ధ్వంసం అవుతున్నాయి. అయితే.. రష్యన్ ఆర్మీకి ఉక్రెయిన్ బలగాలు ఎదురొడ్డి నిలుస్తున్నాయి. దీంతో రష్యా నుంచి దాడులు మరింత తీవ్రం అవుతున్నాయి.
https://www.instagram.com/tv/CbK4fJ9gB_I/?utm_source=ig_web_button_native_share