పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. వీటి వలన కస్టమర్స్ ఎన్నో రకాల ప్రయోజనాలను పొందొచ్చు. అయితే పోస్టల్ డిపార్ట్‌మెంట్ కొత్త పథకాన్ని కస్టమర్స్ కి తీసుకు వచ్చింది. దీని వలన కస్టమర్స్ కి ప్రయోజనాలు కలగనున్నాయి. ఇక పూర్తి వివరాల లోకి వెళితే…
టాటా ఏఐజీత కలిసి ఖాతాదారుల కోసం గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పేరిట ఒక పాలసీని తీసుకు వచ్చింది. అయితే రూ.399 చెల్లించి రూ.10 లక్షల యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ ఫెసిలిటీని కస్టమర్స్ పొందొచ్చు. ఇక పాలసీల వివరాలను చూస్తే..
టాటా ఏఐజీత కలిసి ఖాతాదారుల కోసం గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పేరిట తీసుకు వచ్చిన
ఈ పాలసీని 18 నుంచి 65 ఏళ్ల వయసు కలిగిన వారు తీసుకో వచ్చు. ఒకవేళ వైద్యం కోసం ఆస్పత్రి లో చేరితే రూ.60 వేలు చెల్లిస్తారు. ప్రమాదం లో మరణించినా, శాస్వత వైకల్యం ఏర్పడినా పది లక్షలు ఇస్తారు. ఔట్ పేషంట్ రూ.30 వేల వరకు క్లైమ్ చెయ్యచ్చు. రూ.299 చెల్లించినా రూ.10 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ వస్తుంది.