నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. త్వరలోనే భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు హోమ్ మంత్రి మహమూద్ అలీ ప్రకటన చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారు లో గల పోలీస్ వైల్ఫేర్ కన్వెన్షన్ హాల్ ను మంత్రులు హరిశ్ రావు , మహమూద్ అలీ , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ.. మాదాపూర్, హైటెక్ సిటీ లో ఉన్న ఫంక్షన్ హాల్ ల వలే ఈ కన్వెన్షన్ అలా అందంగా ఉంది,ఇంత తొందరగా నిర్మించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు అని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. సీఎం కేసీఆర్ పోలీసులకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారన్నారు.
తెలంగాణ పోలీసులంటే ప్రజలకు భయం లేకపోగా, సంతోషపడుతున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట అంటే హైటెక్ సిటీ మాదిరిగా ఉందని.. తెలంగాణ ఉద్యమంలో ఎలా సిద్దిపేట ముందుందో అభివృద్ధి లో కూడా సిద్దిపేట ముందుందని వెల్లడించారు. పోలీస్ శాఖ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని…త్వరలోనే భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
NOTE : ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.