ప్రపంచ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజు దాదాపు 60 వేలకు పైగా కేసులు నమోదు అవుతూ ఉండేవి. అయితే ఆదివారం మాత్రం ఆ సంఖ్య 55 వేలకు పడిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు కాస్త అదుపులోకి వచ్చాయని నిపుణులు కూడా అంటున్నారు.
ఒక్క అమెరికా, ఇటలీ, స్పెయిన్ మినహా అన్ని దేశాల్లో కూడా కరోనా వైరస్ అదుపులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 718815 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటలీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97689కి చేరింది. మృతుల సంఖ్య 10779గా ఉంది. అమెరికాలో ఆదివారం కొత్తగా 16326 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13990గా ఉండగా మృతులు 2500 మంది ఉన్నారు.
స్పెయిన్ లో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 6796 కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 80031కి చేరింది. ఆదివారం 820 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతులు 6802కి చేరింది. చైనాలో కొత్తగా 45 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య… 81439. వీరిలో దాదాపు 70 వేల మందికి కరోనా వైరస్ తగ్గింది. మనదేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.