షియామి ల్యాప్ టాప్ లను కొనుగోలు చేస్తున్న వారికి గుడ్ న్యూస్..

-

వేసవిలో స్టూడెంట్స్ అందరికి ఎగ్జామ్స్ అయిపోతాయి..తర్వాత సమ్మర్ హాలీడేస్ వృధా చేయడం ఎందుకు అని ఏదైనా ఆన్ లైన్ కోర్సులు జాయిన్ అవుతారు.అలాంటి వాళ్ళు క్షుణ్ణంగా నేర్చుకోవడానికి స్మార్ట్ ఫోన్ కంటే కూడా ల్యాప్‌టాప్ మెరుగ్గా ఉంటుంది. ల్యాప్‌టాప్ ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారులకు మెరుగైన గొప్ప ఆఫర్లను అందిస్తున్నది.

 

అమెజాన్ తన సైట్ లోని ల్యాప్‌టాప్ స్టోర్ విభాగంలో షియోమి బ్రాండ్ ల్యాప్‌టాప్ల కొనుగోలు మీద డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఇప్పుడు అమెజాన్ లో ఎటువంటి ప్రత్యేక సేల్స్ జరగకపోయినప్పటికీ రోజువారి డిస్కౌంట్ ఆఫర్లలో భాగంగా ల్యాప్‌టాప్లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి..

ఈ షియామి ల్యాప్ టాప్ ల గురించి పూర్తీ వివరాలు..

అల్ట్రా థిన్ & లైట్ ల్యాప్‌టాప్..

ఈ ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.55,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 3K రిజల్యూషన్ తో 15.6-అంగుళాల (39.62 సెం.మీ.) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఇంటెల్ టైగర్ లేక్ కోర్ i5-11300H 11వ జెనరేషన్ తో రన్ అవుతూ 3.1 GHz(బేస్) – 4.4 GHz(గరిష్టంగా) 4 కోర్లను కలిగి ఉంటుంది. విండోస్11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉండి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ మరియు స్టూడెంట్ 2021 సాఫ్ట్‌వేర్ లతో రన్ అవుతుంది. ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

నోట్‌బుక్ ప్రో థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్..

ఈ ల్యాప్‌టాప్ లకు కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.అమెజాన్ లో ఇప్పుడు రూ.54,999 ధర వద్ద లభిస్తుంది. ఇది ఇంటెల్ కోర్ i5-11300H 11వ Gen వద్ద రన్ అవుతూ 14 అంగుళాల QHD+ IPS యాంటీ గ్లేర్ డిస్‌ప్లేను సన్నని మరియు తేలికపాటి డిజైన్ తో వస్తుంది. ఇది 8GB ర్యామ్ 512GB SSD మరియు Iris Xe గ్రాఫిక్స్ లతో పాటుగా విండోస్11/MS ఆఫీస్ 21 మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్లను కలిగి ఉంటుంది..HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటు లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news