నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో రెండు వారాల్లో జాబ్ నోటిఫికేషన్

-

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పార్లమెంట్ ఎన్నికలతో ప్రజా పాలనకు బ్రేకులు పడ్డాయని మరో రెండు వారాల్లో జాబ్ నోటిఫికేషన్ వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వెల్లడించింది. ప్రతి ఏటా నోటిఫికేషన్లతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాదికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ల పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీ-కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ గత ప్రభుత్వం పై ఫైరయ్యారు. కేటీఆర్ నిరుద్యోగుల గురించి మాట్లాడటం ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉందని సెటైర్లు వేసింది. పరీక్షలను పారదర్శంగా నిర్వహించలేని బీఆర్ఎస్ ప్రభుత్వం, యువత దశాబ్ద కాలాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టింది.

TGPSC భర్తీ చేసే గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీస్, వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు, ఇతర విభాగాల పోస్టులన్నింటినీ సంబంధించిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనుంది. ఉద్యోగ క్యాలెండర్ విడుదలపై నిర్ణయం తీసుకొన్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసెందుకు సంబంధిత విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీల్ని గుర్తించాలని TGPSC లేఖలు రాసింది. దీంతో ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్-1, 2, 3, 4 సర్వీసు ఉద్యోగాల నోటిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలని సీఎం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version