వారికి కేంద్రం గుడ్ న్యూస్…!

-

ఈ మధ్య చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. అయితే NPS గురించి మీకు తెలిసిందే. ప్రభుత్వం దీన్ని తీసుకు వచ్చింది. రిటైర్ అయ్యాక సీనియర్‌ సిటిజన్‌లకు స్థిరమైన పెన్షన్ వస్తుంది. పైగా దీనిలో డబ్బులు పెట్టడం వలన మెరుగైన రాబడి, ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ ని కూడా పొందొచ్చు. అయితే ఈ స్కీమ్ లో కొన్ని మార్పులు వచ్చాయి. మరి ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది చూద్దాం.

సీనియర్‌ సిటిజన్‌లు ఇప్పుడు ఈ స్కీమ్ లో 70 సంవత్సరాల వయస్సు వరకు పెట్టచ్చు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టడానికి వయస్సు ని ఇప్పటికే 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచింది. ఇప్పుడు 65 నుంచి 70 సంవత్సరాల వయస్సు వాళ్ళు దీనిలో డబ్బులు పెట్టుకో వచ్చు. ఈ స్కీమ్ ని 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న ఎవరైనా కూడా ఓపెన్ చెయ్యచ్చు.

వయస్సు కారణంగా ఎవరైనా గతంలో వారి అకౌంట్‌లను క్లోజ్ చేసేసినట్టైతే వారు ఇప్పుడు కొత్త NPS అకౌంట్‌ను రిజిస్టర్‌ చేసుకో వచ్చు. సీనియర్ సిటిజన్‌లకు రిటైర్ అయ్యాక కలిగే అవసరాల ని దృష్టిలో ఉంచుకుని ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. దీనిలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా సీనియర్‌ సిటిజన్‌లు జీవితాంతం స్థిరమైన పెన్షన్ వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version