పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్…!

-

గుడ్ న్యూస్. ఎక్కువ పెన్షన్ కోసం దరఖాస్తు చేసే వేతన జీవులు, కార్మికులు, ఉద్యోగులు, పింఛనుదారులకు రిలీఫ్ కలగనుంది. ఈపీఎఫ్ చట్టంలోని పేరా నం.26(6) కింద ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్‌కు సంబంధించిన ప్రూఫ్ ని ఇవ్వాల్సి వచ్చేది. అది లేకపోవడం వలన చాలా మంది చాలా మంది అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేయలేకపోతున్నారా. ఈ క్రమంలో పేరా నం.26(6) సంబంధించిన ఆధారం లేకపోయినా కూడా దరఖాస్తు చేసేలా తీసుకొచ్చారు.

ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు అని కేంద్ర కార్మిక శాఖ అంది. పేరా 26(6) సంబంధిత ఆధారం లేని ఉద్యోగులు, కార్మికులకు రిలీఫ్ ని పొందుతున్నారు. ప్రస్తుతానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి అనుమతి ఇచ్చారు. అయినా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అధిక పెన్షన్ కి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు పేరా 26(6) నిబంధన తప్పనిసరి అని మంత్రి స్పష్టం చెప్పారు. సో దరఖాస్తు పరిశీలన సమయానికి కంపెనీ యాజమాన్యాలు లేదా ఉద్యోగులు లేదా పింఛనుదారులు ఉమ్మడి ఆప్షన్ కి సంబంధించిన ఆధారాన్ని ఇవ్వాల్సి వుంది.

ఈపీఎఫ్ఓ చట్టం ప్రకారం చూస్తే.. గరిష్ఠ శాలరీ లిమిట్ 2014, సెప్టెంబర్ 1 తేదీకన్నా ముందు రూ.6,500, తర్వాత రూ.15 వేలుగా ఉంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని కార్మికులు ఎక్కువ పెన్షన్ కోసం 201 సెప్టెంబర్ 1 నాటికి పేరా 11(3) కింద అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్ ఇవ్వకపోతే వాళ్లకి అవకాశం ఇస్తోంది. మే 3వ తేదీలోగా పింఛనుదారులు లేదా చందాదారులు దరఖాస్తు చేసుకోవాలి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version